- Advertisement -
నవతెలంగాణ: రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గమును చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యరూ అభినందించారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు దూడం శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి మండల సత్యం ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య కోశాధికారి ఎల్లే శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కోడం శ్రీనివాస్ తో పాటు వ్యాపారవేత్త గోవింద రవి లు శైలజ రామయ్యరూ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గంను ఆమె అభినందించారు. పద్మశాలి సామాజిక వర్గం అభివృద్ధికి పాటు పడాల్సిన బాధ్యత నూతన కార్యవర్గం పై ఉందని ఆమె పేర్కొన్నారు.
- Advertisement -


