నవతెలంగాణ – భువనగిరి
హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో మూసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు భూదాన్ పోచంపల్లి వద్ద ఉన్న జూలూరు మూసి లో లెవెల్ బ్రిడ్జి, సంగం బ్రిడ్జులను బుధవారం పరిశీలించారు. వరదనీరు ఎక్కువగా వచ్చే పరిస్థితుల్లో రహదారులను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులను సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు పూర్తిగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు. డిసిపి అక్షాన్స్ యాదవ్, ఏసీపీ, సిఐలు, ఎస్సైలు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
మూసి కాల్వ లెవెల్ బ్రిడ్జిలను పరిశీలించిన కమిషనర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES