Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కమీషనర్

నీట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కమీషనర్

- Advertisement -

పరీక్షా కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు
ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్ష నిర్వహణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాదులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మరియు గిరిరాజు ప్రభుత్వ కాలేజీ పీజీ బ్లాక్ లను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య బందొబస్త్ ఏర్పాట్లు పరీక్ష కేంద్రాలను ఆదివారం సందర్శించి పరీక్ష సరళి పరిశీలించారు. ఈ సందర్బంగా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకుండా చూడాలని, పోలీసు అధికారులకి సిబ్బందికి సూచించారు. అందరు బాధ్యతగా పని చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూముకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ జేేఎం. శ్రీనివాస్, పీజీ బ్లాక్ ఇంచార్జి డిప్యూటీ సి ఎస్. డాక్టర్ కె. రంజిత, టౌన్ 3 పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -