Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన కమిషనర్

రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్  : రెంజల్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్ పనితీరు, కంప్యూటర్ పని తీరును ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 5s విధానం అమలు చేస్తున్నారా లేదా అని దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల పార్కింగ్ ను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను చేపట్టాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని ఆయన స్థానిక సిబ్బందిని ఆదేశించారు. గాంజాయి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, గాంజాయీ కి బానిసలైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాల నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది సాధక బాధకాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి పి. శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రెంజల్ ఎస్సై పి  చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad