Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఒలంపిక్ రన్ కార్యక్రమం ప్రారంభించిన కమిషనర్

ఒలంపిక్ రన్ కార్యక్రమం ప్రారంభించిన కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : రాష్ట్ర ఒలంపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్.ఆర్ చౌరస్తా నుండి ఒలంపిక్ రన్ ముఖ్యఅతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్యఅతిథిగా పాల్గొని ఒలంపిక్ టార్చ్ , జెండాను ఊపి ఒలంపిక్ రన్ ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఒలంపిక్ ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీడల్లో పాల్గొంటారని ప్రతి క్రీడాకారుని కల ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆశయమని అన్నారు. ఒలంపిక్ డే సందర్భంగా జిల్లా ఒలంపిక్ సంఘం నిర్వహించిన ఒలంపిక్ రన్ క్రీడాకారులు విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. చదువుతోపాటు అందరి విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని అందులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది విధులను నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఒలింపిక్ సంఘం సభ్యులు, నిజామాబాద్ నగర ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad