Tuesday, April 29, 2025
Homeజిల్లాలుమృతుని కుటుంబానికి చెక్ అందించిన కమిషనర్

మృతుని కుటుంబానికి చెక్ అందించిన కమిషనర్

నవతెలంగాణ – కంఠేశ్వర్

నవంబర్ 27, 2024 రోజున రాథోడ్ ప్రతాప్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ 649, పోలీసు హెడ్ క్వార్టర్స్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. భద్రత ఎక్స్ గ్రేషియా రూపంలో గల చెక్కు 16,00,000/- ( పదహారు లక్షల రూపాయల) చెక్కును సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చేతుల మీదుగా కీ॥ శే॥ రాథోడ్ ప్రతాప్ సింగ్ సతీమణి అయిన రాథోడ్ కౌసల్యకి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె. రామచంద్రరావు, ఎ.ఓ అనిసాబేగం, ఆఫీస్ సూపరింటెండేoట్ వనజ, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంటు షకీల్ పాషా , డి.పి.ఓ సీనియర్ అసిస్టెంటు పి.రాజేశ్వర్, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img