చైర్మెన్‌గా రిటైర్డ్ జడ్జి గోపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల నియంత్రణ, ఫీజుల ఖరారుకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. చైర్మెన్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎ గోపాల్‌రెడ్డి, సభ్యులుగా ఉన్నత విద్యామండలి చైర్మెన్, జేఎన్టీయూ/ఓయూ/ఎంజీయూ/ కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ వీసీలు, ఆర్థిక శాఖ నుంచి ప్రతినిధి, ఓయూ వీసీ వీసీ ఎం కుమార్, సిద్ధిపేట మెడికల్ కాలేజీ డైరెక్టర్ విమల థామస్, చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఆర్ నవీన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది జి జయారెడ్డి, ఏఐసీటీఈ/ఎంసీఐ/బీసీఐ/ఎన్‌సీటీఈ నుంచి ప్రతినిధి, చైర్మెన్ నియమించే ప్రత్యేక ఆహ్వానితులు, సభ్య కార్యదర్శిగా విద్యాశాఖ/వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి వ్యవహరిస్తారని తెలిపారు.
ప్రయివేటు వృత్తివిద్యా కాలేజీల్లో అడ్మిషన్లు, ఫీజుల ఖరారుకు కమిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



