Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

- Advertisement -

సీఎస్‌ కే రామకృష్ణారావు ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంపై పథకం సజావుగా అమలు చేసేందుకు వీలుగా అధ్యయనానికి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌ చైర్మెన్‌గా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వైస్‌ చైర్మెన్‌గా, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా ఉన్నారు. సభ్యులుగా విద్య, ఎస్సీ అభివృద్ధి, బీసీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యతో పాటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నుంచి ముగ్గురు ప్రతినిధులు కమిటీలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పాలసీపై కమిటీ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా, సుస్థిరంగా హేతుబద్ధంగా ఉండే ఫీ రీయింబర్స్‌మెంట్‌ విధానానికి అవసరమైన సూచనలను కమిటీ చేయనున్నది. అక్టోబర్‌ 28న కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -