రాష్ట్రంలో బీజేపీ మంత్రుల ద్వంద్వ వైఖరి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఖమ్మం
దేశంలో మోడీ పాలనలో మతతత్వం ప్రమాదకరంగా మారిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని సుందరయ్య భవన్‌లో పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని విమర్శించారు.
మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక రంగంలో సంస్కరణలను వేగవంతం చేశారని, ముఖ్యంగా రైల్వే, రక్షణ, విద్య, వైద్య, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని చెప్పారు. కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాశారని అన్నారు. బీజేపీ మతతత్వాన్ని కార్పొరేట్ శక్తులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరం అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై దాడులు చేస్తూ.. పౌరసత్వం నిరూపించు కోవాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందన్నారు. దేశంలో ఇతర మతాలను రెండో తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్మించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ దేశవ్యాప్త కులగణనను వ్యతిరేకిస్తోందని, కానీ కులగణనకు, రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు.
బీజేపీ మంత్రులు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, ఎర్ర శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ విష్ణువర్ధన్, రమేష్, ఎంఏ జబ్బార్, ఎస్.నవీన్‌రెడ్డి, షేక్ మీరాసాహెబ్, దొంగల తిరుపతిరావు, మండల కార్యదర్శి భూక్య శ్రీనివాస్ పాల్గొన్నారు.
మతతత్వం దేశానికి ప్రమాదకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES