– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కమ్యూనిస్టు యోధుడు విఎస్ అచ్యుతానందన్ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన ఈ తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కూనంనేని సంతాపం
కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆయన బాల్యంలోనే చదువు మానేసి కార్మికుడిగా పనిచేసి కార్మిక నాయకుడిగా ఎదిగారని పేర్కొన్నారు. ట్రావెన్‌కోర్ సంస్థానంలో భూపోరాటం చేసి జైలుకెళ్లి రాజకీయ జీవితం గడిపారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అచ్యుతానందన్ మరణం పట్ల సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సంతాపం తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించి లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతోపాటు ప్రపంచంలోనే కీలక ఘట్టాలను చూసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అచ్యుతానందన్ మరనం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
కమ్యూనిస్టు యోధుడు అచ్యుతానందన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES