నవతెలంగాణ – భువనగిరి : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తాలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండాను భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య ఆదివారం ఎగురవేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్ మాట్లాడుతూ భూస్వాములు జమీందారులు జాగిర్దారులకు వ్యతిరేకంగా పేద ప్రజలకు భూములు పంచాలని దున్నేవాడికి భూమి కావాలనే నినాదంలో సిపిఐ చేపట్టిన పోరాటాల ఫలితంగానే భూసంస్కరణల చట్టం అమలులోకి వచ్చిందని అన్నారు.
శ్రమజీవుల కోసం పుట్టిన పార్టీ సిపిఐ కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల పక్షం అన్నారు. 100 సంవత్సరాలలో సిపిఐ కార్మికులు కర్షకులు పేదల హక్కుల కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిందని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం త్యాగాలు చేసిన పార్టీ సిపిఐ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భవననిర్మాణ కార్మిక సంఘం ఉప ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య సిపిఐ నాయకులు చింతల పెంటయ్య చొప్పరి సత్తయ్య భవన నిర్మాణ కార్మికులు ఎల్లంల సతీష్, దాసరి వెంకటేష్, బండారి కుమార్, ఎల్లయ్య పాల్గొన్నారు.



