Sunday, September 14, 2025
E-PAPER
Homeకరీంనగర్సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు: సీపీఐ(ఎం)

సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కోడం రమణ, కామ్రేడ్ అమృతలాల్ శుక్లా తనయుడు శాంతి ప్రకాష్ శుక్లా అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తంగళ్లపల్లిలోని మానేరు వంతెన వద్ద కామ్రేడ్ అమృతలాల్ శుక్లా, మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ సమీపంలో కామ్రేడ్ సింగిరెడ్డి భూపతిరెడ్డి ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశత్వ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారుల దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టి మనుషులు చేసిన మహోత్తరమైన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని అన్నారు.

ఈ పోరాటంలో ఇసుమంతా సంబంధం లేని భాజపా సెప్టెంబరు 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని, విమోచన, విద్రోహ దినోత్సవంగా జరుపుతూ హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరించి ప్రజలను పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేసి, నాటి పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకకుంటు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. వాటి పోరాట చరిత్రనే నేటి ప్రజానీకానికి తెలియజేయడంలో భాగంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సెప్టెంబరు 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

సెప్టెంబర్ 17న జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పోరాట అమరవీరుల చిత్రపటాలకు ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విమల, పద్మ, సురేష్, నర్సయ్య, శంకర్, గంగాధర్, శ్రీనివాస్, సదానందం, హరిదాసు, వేణు, రాంనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -