– డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ రవీందర్ నాయక్‌కు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బానోత్ రవీందర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌నాయక్‌కు నూతన సంవత్సర, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు తమ సమస్యలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని క్యాడర్‌లలోని ఖాళీలను గుర్తించి ప్రమోషన్లు ఇవ్వాలనీ, మల్టీజోన్-1లో సీహెచ్‌ఓ ఖాళీలు చాలా ఉన్నాయని వివరించారు. వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. డైరెక్టర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ నెహ్రూచంద్ నాయక్, ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు బి. మధుసూదన్ రెడ్డి, నాయకులు , బి. ప్రసాద్, టీఎన్‌జీఓ నాయకులు కత్తి రవీందర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



