Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రజా భద్రత కోసమే కమ్యూనిటీ పోలీసింగ్ 

ప్రజా భద్రత కోసమే కమ్యూనిటీ పోలీసింగ్ 

- Advertisement -

తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి 
: ప్రజల భద్రత కోసం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమన్ని నిర్వహిస్తున్నామని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మొండాలతోగు గుత్తి కోయ గూడెంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు నిర్వహించి, వారిని ఉద్దేశించి మాట్లాడారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగడానికి ముందే దాని నిరోధించడం దాని ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ వాడకం, మద్యం సేవించకుండా సీట్ బెల్ట్ ధరించి వేగం లాంటి అనేక భద్రత పాటిస్తూ వాహనాన్ని నడిపినప్పుడే ప్రమాదాలు జరగవని ఆయన సూచించారు. అలాగే బాల్యం వివాహాలు, పిల్లలు భవిష్యత్తును నాశనం చేస్తాయని, అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని అన్నారు. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లో నేరాలు, ప్రమాదాల నియంత్రణకు సీసీ కెమెరాల ఆవశ్యకతను, సైబర్ నేరాలు పట్ల అవగాహన అవసరం అని వివరించారు. కార్యక్రమంలో పోలీసులు పూజారి రమేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -