Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిత్తనాలతో నష్టపోతే పరిహారం చెల్లించాల్సిందే

విత్తనాలతో నష్టపోతే పరిహారం చెల్లించాల్సిందే

- Advertisement -

ఆ నిబంధనను నూతన విత్తన చట్టం-2025లో పొందుపర్చాలి
రైతుకు మేలు చేసేలా మార్పులు చేయాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విత్తనాలతో రైతులు నష్టపోతే సంబంధింత కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించే నిబంధనను నూతన విత్తన చట్టం-2025లో పొందుపర్చాలనీ, రైతులకు మేలు చేసేలా ఆ ముసాయిదా చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నూతన విత్తన చట్టంపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, కమిషనర్‌ డాక్టర్‌ గోపి, అదనపు కమిషనర్‌ నరసింహారావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్‌ అన్వేశ్‌రెడ్డి, ప్రొఫసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌ ఆల్దాస్‌ జానయ్య, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సుచరిత, రామలక్ష్మి, ఉప సంయుక్త సంచాలకులు అనిత, తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. ముసాయిదా చట్టం విధివిధానాలను, లోటుపాట్లను మంత్రి తుమ్మల వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వ్యవసాయంలో విత్తనం ప్రాథమిక అవసరమనీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983లో పలు లోపాలుండటంతో విత్తన సంస్థలు రైతులకు నష్టం చేకూరుస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ముసాయిదా చట్టాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చిందని తెలిపారు. దానిపై రైతువేదికల ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలనీ, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని ముసాయిదా చట్టంలోని లోపాలను అధిగమించేందుకు చేయాల్సిన మార్పులు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పొందుపర్చాల్సిన అంశాలను సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాలు చేసినప్పుడు పంట నష్టం జరిగితే త్వరిగతిన పరిష్కరించి రైతులకు న్యాయం చేసేలా, కంపెనీ నుంచి నష్టపరిహారం పొందేందుకు తప్పని సరిగా నిబంధనలు పెట్టేలా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు. విత్తనోత్పత్తి రైతులకు నాణ్యతలేని విత్తనాల వలన నష్టం జరిగినప్పుడు సంభందిత విత్తన కంపెనీ పై చర్యలు తీసుకునేలా ముసాయిదా చట్టంలో నిబంధనలు పెట్టకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రతిపాదిత ముసాయిదా చట్టంపై చేయాల్సిన మార్పులు, చేర్పులపై డిసెంబర్‌ 11లోగా పంపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -