- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో మొంథా తుఫాన్ కారణంగా లక్షా 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,580, వరంగల్‌లో 19,736 ఎకరాల నష్టం వాటిల్లినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందాన్ని పర్యటించమని కోరామన్నారు. దెబ్బతిన్న పంటలకు త్వరలోనే ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
- Advertisement -



