10వేలు ఇస్తామనడం సరైంది కాదు
రైతుల నిరసన
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
మొంథా తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి రూ.40 వేల పరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామంలో బుధవారం రోడ్డుపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మల్లికార్జున్‌రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురవడంతో చేతికందే దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పంట నష్టం సర్వే చేయాలని కోరారు. ప్రభుత్వం కేవలం ఎకరానికి రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామనడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు.



