నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నీట మునిగిన పంటలకు ఎకరాకు రూ.4వేల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాగిరెడ్డిపేట మండల శాఖ తరపున తహసిల్దార్ శ్రీనివాసరావు కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాగిరెడ్డిపేట మంజీరా పరివాహక గ్రామాలలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీవర్షాలకు వరి పంట నీట మునగడం జరిగింది. అదేవిధంగా గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలుపరిచి రైతుల న్యాయం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమాన్లు, ఉపాధ్యక్షులు ఈశ్వర్ గౌడ్, గోపాల్, నాయకులు అంజయ్య , సిద్ధిరాములు, కృష్ణ, విష్ణు, రాజు, బూత్ అధ్యక్షులు రాములు, గోపాల్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.40వేల నష్టపరిహారం ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -