ఆర్టీఐ నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు.
మోంథా తుపాన్తో వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు, అలాగే నీట మునిగిన ఇళ్లకు తక్షణసాయం కింద రూ.50 వేల సహాయాన్ని అందించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో మాట్లాడారు తుపాన్తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల 47 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.రెండు లక్షల 57 వేల మంది రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు.ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయి మరణించారని,16,500 ఇల్లు కూలిపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు.అనేక ప్రాంతాల్లో ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు వచ్చాయని అలాగే వరి నెలవాలిందని, పత్తి చెట్లపై తడిసిపోయి బూజు పట్టిన పరిస్థితి ఉందన్నారు.తడిసిన వరి, పత్తిని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని,మానేరు పరివాహక ప్రాంతాల్లో కొట్టుకపోయిన మోటార్లు,విద్యుత్ తీగలు,పిడుగుపాటుతో చనిపోయిన ముగజీవాలకు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


