సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
త్రిబుల్ ఆర్ భూబాధితులను కలిసి భరోసా
నవతెలంగాణ-మర్రిగూడ
త్రిబుల్ ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధర కంటే మూడురెట్లు అదనంగా పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి, బట్లపల్లి గ్రామాల్లో సోమవారం త్రిబుల్‌ఆర్ రైతులను సీపీఐ(ఎం) నాయకులు కలిసి మాట్లాడారు. త్రిబుల్ ఆర్ కొత్త అలైన్‌మెంట్‌లో పోతున్న భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్‌ఆర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూబాధిత రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా ఏకమై పూర్తిస్థాయిలో నష్టపరిహారం వచ్చే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులను కలిసిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి ఐలయ్య, బండ శ్రీశైలం, మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నాయకులు నీలకంఠం రాములు, సల్వోజు రామలింగాచారి, కొట్టం యాదయ్య, చెల్లం ముత్యాలు, ఏరుకొండ రాఘవేంద్ర, ఆయిల్ కృష్ణయ్య, సిరసనవాడ ఎల్లయ్య, ఊరుపక్క వెంకటయ్య తదితరులు ఉన్నారు.
మార్కెట్ రేట్ కంటే మూడు రేట్లు అదనంగా పరిహారమివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES