మంత్రి మహ్మద్ అజహరుద్దీన్‌కు ఎంఐఎం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల బాన్సువాడలో చోటు చేసుకున్న అశాంతి ఘటనలో బాధితులుగా మారి నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వాలని ఎంఐఎం పార్టీ కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్‌తో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం రైట్ వింగ్ శక్తులు ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఎనిమిది మంది ముస్లీంలను అరెస్టు చేశారనీ, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, సామాజిక సామరస్యానికి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం ప్రభుత్వ ముఖ్య బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు మహ్మద్ ముబీన్, మీర్ జుల్ఫికార్ అలీ, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కౌసర్ మొహియుద్దీన్, ఎమ్మెల్సీలు మీర్జా రహ్మత్ బేగ్, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండిలు పాల్గొన్నారు.
బాధిత వ్యాపారులకు పరిహారం ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



