నవతెలంగాణ – బజార్ హాత్నూర్
భారీ వర్షంతో నీట మునిగి పంట పొలాలు కొట్టుకుపోయిన వాటికి ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని భారీ వర్షంతో మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పలకరించి ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందేలా ఒత్తిడి తీసుకొస్తానని భరోసా కల్పించారు.
నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతీ గుంట భూమిని రికార్డు చేసి నివేదిక అందజేయాలని ప్రతీ ఒక్క రైతుకు న్యాయం జరిగేలా అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్యాంసుందర్, మండల కన్వీనర్ రాజారాం, యువజన సంఘం అధ్యక్షులు డుబ్బుల చంద్రశేఖర్, మండల నాయకులు చిలుకూరి భూమన్న, అందే ప్రకాష్, దీసి రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES