No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి ..

రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి ..

- Advertisement -

తుమ్మల వెంకటరెడ్డి రైతు సంఘం జిల్లా కార్యదర్శి  
నవతెలంగాణ – గోవిందరావుపేట 
: యాసంగి వ్యవసాయంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో  తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతులకు పరిహారం చెల్లించాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ గత ఏప్రిల్ మే నెలలో కురిసిన భారీ వర్షాలకు వడగండ్ల వానకు మండలంలోని పొలాలన్నీ 50 నుండి 60 శాతం దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి వ్యవసాయ శాఖ  సర్వేలు చేసి నివేదికలు ప్రభుత్వానికి పంపినారు. ప్రభుత్వం ములుగు జిల్లాకు 2993 ఎకరాల గాను 5.72 లక్షలు మంజూరు చేసిన రైతుల అకౌంట్లో జమగా కా లేదు .ఖరీఫ్ సీజన్లో పెట్టుబల సీజను ఆరంభమైంది రైతులకు వెంటనే నష్టపరిహారం జమ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా యాసింగిలో సన్నధాన్యానికి రైతులకు ఇప్పటివరకు ఎవరికీ బోనస్ పడలేదు వెంటనే బోనసులు రైతుల అకౌంట్లో జమ చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతు భరోసా రాష్ట్రంలో కాస్తు చేస్తున్న భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తానని గతంలో ప్రభుత్వం మూడు ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా ఇచ్చింది. కనీసం 10 ఎకరాలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఖరీఫ్ లో నకిలీ విత్తనాలను ఎరువు పురుగు మందులను అరికట్ట లని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గుండు రామస్వామి తీగల ఆదిరెడ్డి తోపాటు సోమ మల్లారెడ్డి  అంబాల మురళి గుండు లెనిన్ మోపిదేవి సమ్మయ్య బిక్షం కుంట పుల్లారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు 50 మంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad