Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి 

పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి 

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 29 న సబ్ కలెక్టర్ కార్యాలయ ముందు ధర్నా
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

అధిక వర్షాల వరదలు వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో 29 న సబ్ కలెక్టర్ కార్యాలయ ముందు ధర్నా చేస్తామని తెలంగాణ రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ నిజాంబాద్ పట్టణంలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో ఏం గంగాధరప్ప అధ్యక్షతన జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వేలాది ఎకరాలు పంట నష్టం జరిగింది రైతులు కష్టపడి పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు వరదల వల్ల నష్టపోవడం జరిగిందన్నారు.

పొలాల్లో ఇసుక మేటలు, వందల ఎకరాలు నీట మునిగి వరి పత్తి మొలక రాకుండా నష్టం జరిగిందని అన్నారు. దరుపల్లి భీమ్గల్ ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇసుక మేటలు తో పాటు పంట పొలాలని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, పడిపోయి చేతికి రాకుండా పోయిందని అన్నారు. నష్టపోయిన పంట చాలా పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.5000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. నష్టపరిహారం చెల్లించటానికి ఈనెల 29న తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్మూరు బోధన కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ భూమన్న, నాగలక్ష్మి ,దేవేందర్ సింగ్, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -