Tuesday, July 22, 2025
E-PAPER
Homeవరంగల్పిడుగుపాటుతో మృతిచెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించాలి.

పిడుగుపాటుతో మృతిచెందిన గొర్రెలకు నష్టపరిహారం అందించాలి.

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు:

మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పుట్ట పోచయ్య సిరిపురం దగ్గర గోదావరి ఒడ్డుకు గొర్లను మేపాడానికి వెళ్లగా సాయంత్రం 5 గంటల సమయంలో ఒకే సారి పెద్ద శబ్దంతో గొర్ల మంద పైన పిడుగు పడటంతో 30 గోర్లు అక్కడికి అక్కడే మృతి చెందాయని మృతి చెందిన గొర్రెలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు కన్న బిడ్డలా పెంచుకున్న గొర్రెలు కళ్ళముందే మరణించడంతో గొర్ల కాపరి పుట్ట పోచయ్య కళ్ళు ఒకే సారి మూతలు పడి స్పృహ కొలిపోయారన్నారు.అక్కడే ఉన్న గొర్లు మేపుతున్న మరో గొర్ల కాపరి గంగయ్య వెంటనే వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వెళ్ళి వెంటనే పుట్ట పోచయ్యను హాస్పిటల్ కి తరలించారు. ప్రభుత్వం వెంటనే పిడుగు పాటుకు గురై 30 గొర్రె ల మృతితో దాదాపు రూ. 3 లక్షల పైగ నష్టం జరిగిందని, అ గొర్రెల కాపరి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని నష్టం పరిహారం చెల్లించాలని కోరారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -