Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు పోటీలు 

జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యంలో విద్యార్థులకు పోటీలు 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్ 
మండల విద్యా పనుల కేంద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి సమ్మిరెడ్డి తెలిపారు. బుధవారం మండల విద్యావరణల కేంద్రంలో ఏపీ ఎస్టి ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ఉత్తమ పతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల చెందిన విద్యార్థులు ఈ ప్రతిభ పోటీలలో పాల్గొన్నారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతి వెంకట లీల తేజస్విని, ద్వితీయ బహుమతి అనన్య, తృతీయ బహుమతి మహంత్ లకు బహుమతులను పంపిణీ చేశారు. ఈనెల 23వ తేదీన జిల్లా స్థాయిలో జరిగే టాలెంట్ టెస్టులలో పాల్గొని తమ ప్రతిభ కనబరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మామిడి రవీందర్, ఉపాధ్యాయులు రవి, మహేష్, గణేష్, గంగమణి అన్నపూర్ణ, మధు,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -