నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని వడ్లం గ్రామం పంచాయతీలో పనిచేస్తున్న మారుతి అనే వ్యక్తి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టే క్రమంలో మారుతి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యలు చేశారు. దీంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంతోల్ల మారుతి, బిచ్కుంద మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఎంపీడీవో అభినవ్ చందర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో పనిచేస్తూ ముఖ్యమంత్రిని తిట్టడం సరైనది కాదని అన్నారు. జీపీ కార్మికులు పార్టీలకు అతీతంగా ఉండి గ్రామాలలో సమస్యలను చక్కబెట్టలే కానీ రాజకీయాలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామంలో కూడా తన విధులు సరిగ్గా నిర్వహిస్తలేరని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కార్యక్రమలో ఆయనతోపాటు ఎర్రోళ్ల మారుతి ఉన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికునిపై ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



