Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతిపై గ్రివెన్స్ లో ఫిర్యాదు..

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతిపై గ్రివెన్స్ లో ఫిర్యాదు..

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
పరకాల పట్టణం లో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ పారదర్శకంగా లేకపోవడం, అనర్హులు అయిన వారికి మంజూరు చేయడం వెనుక పెద్ద కుట్ర జరగడమే కాకుండా, అలాంటి వాటికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివరించడం జరిగింది. అర్హులు కానీ వారికి అర్హత పత్రాలు జారి చేసిన నాయకులు అధికారులు పేద ప్రజల సొంత ఇంటి కలని అందని ద్రాక్ష గా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో ఏ నిబంధనల ప్రకారం గతం లో లబ్దిదారులకి,గృహ లక్ష్మి వచ్చిన వారికి మరియు సగం అయ్యిన వాటికి అనర్హులుగా ప్రకటిస్తూ కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది.

కానీ స్థానిక నాయకులు అధికారులు ఇందిరమ్మ కమిటీ నాయకులు వాటిని తుంగ లో తొక్కి పేద ప్రజలు నిజంగా అర్హులు అయిన వారికి కాకుండా తిరిగి మళ్ళీ అనర్హులు అయిన వారికే ఇందిరమ్మ ఇండ్ల పట్టం కడుతుందటం అవినీతికి పాల్పడుతున్నారు.అలాంటి అధికారుల పై అలాంటి నాయకులు ఇందిరమ్మ కమిటీ నాయకులు కార్యకర్తల పై విచారణ జరిపిఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై చట్టరీత్య చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివరించడం జరిగింది. ఇష్టారాజ్యంగా పేద ప్రజల కి వ్యతిరేఖంగా తీర్మానం చేసిన అధికారులపై వెంటనే విచారణ జరిపి వారిని చట్టరీత్యా చర్యతీసుకుని పేదలకి న్యాయం చేయాలని నిజంగా అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఒంటేరు చక్రి హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -