Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు 

విద్యుత్ సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు 

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
తాండూరు, కిచ్చన్నపేట్, అక్కంపల్లి గ్రామాల్లో ప్రతిరోజు విద్యుత్తు అంతరాయం ఏర్పడుతూ, కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలువని పరిస్థితుల్లో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు సోమవారం ట్రాన్స్కో డీ ఈ ఈ కి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సింగిల్ ఫేస్ బుడ్డి లు ఓవర్ లోడ్ తో ట్రిప్పు అవుతూ తాండూర్, అక్కంపల్లి, కిచ్చన్నపేట్ గ్రామాలకు  విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నది వారు పేర్కొన్నారు. దానికి తోడు గ్రామాల్లోకి వచ్చే కరెంట్ లైన్, పంటపొలాలకు వెళ్లే కరెంట్ లైన్ సబ్-స్టేషన్ నందు ఒకటే ఫీడర్ కు ఉన్నందున, పోలాల వద్ద లైన్ ప్రాబ్లెమ్ ఉండి ఎల్ సి తీసుకుంటే గ్రామాల్లో  విద్యుత్ సమస్య ఏర్పడుతుందన్నారు. సమస్యను తీర్చే విద్యుత్ సరఫరా ఎల్లవేళలా ఉండే విధంగా చూడాలని వారు పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -