Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు

విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ పరిధిలో గల మొత్తం 14 వార్డులలో సుమారుగా 3 నుండి 4 విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరి, కొన్ని విరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ క్రమంలో బొంపెల్లి యువకుడు విజయ్ కుమార్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్తంభాల కింది భాగంలో ఇనుప రాడ్లు కనిపించేలా ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొన్నాడు. కొన్ని స్తంభాల దగ్గర పైపూతలాగా సిమెంటు పెట్టి ముసేశారని తెలిపారు.

గాలివాన, ఈదురు గాలులు వీస్తే ఈ విద్యుత్ పోల్స్ అలవోకగా విరిగి ప్రజల ప్రాణాలను హరించే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. వెంటనే సంబంధిత విద్యుత్ అధికారి ఏఈ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విద్యుత్ స్తంభాలు 22-01-1969, 1972 కాలంలో ఏర్పరిచిన స్తంభాలని తెలిపారు. ఇవి దాదాపుగా 55 ఏండ్లనాటి స్థంభాలని వివరించారు. విద్యుత్ సమస్యలు పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలేస్తే”  కామారెడ్డి జిల్లా కలెక్టర్ & సబ్ కలెక్టర్ లకు మా సమస్యను తీవ్రస్థాయిలో చెప్పే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -