- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని కోటార్మూరు లో శ్రీ లక్ష్మీ నరసింహ ఇన్ఫ్రా సంస్థ వారు బఫర్ జోన్లు ఉన్న ఇరిగేషన్ భూమిలో అక్రమ కట్టడాలు కడుతున్నారని సోమవారం ఇరిగేషన్ ఈఈకి బిఆర్ఎస్ నాయకులు పూజ నరేందర్, అగ్గు క్రాంతి లు ఫిర్యాదు చేసినారు. తప్పుడు సమాచారంతో ఎన్ఓసి కూడా తీసుకున్నారని, ఎన్వోసీని రద్దుచేసి ఇరిగేషన్ భూమిలో కడుతున్న అపార్ట్మెంట్ పై చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ భూమిని కాపాడాలని కోరినారు.
- Advertisement -