నవతెలంగాణ – ఊరుకొండ 
ఊరుకొండ మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరు ఏమాత్రం బాగాలేదని.. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయించకుండా గ్రామపంచాయతీ కార్మికులను తమ సొంత పనులకు పంపిస్తుందని గ్రామానికి చెందిన పోలే అర్జునయ్య శుక్రవారం ఊరుకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీటీవో కృష్ణయ్యకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాల్సిన గ్రామపంచాయతీ కార్మికులు గ్రామంలో పనులు చేయకుండా వారికి వేతనాలు తక్కువ వస్తున్నాయని.. వారిని కూలీ పనులకు వెళ్ళమని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరు ఏమాత్రం బాగాలేదని.. వెంటనే తగు చర్యలు తీసుకుని గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరిగేలా చూడాలని ఎంపీడీవోను కోరారు. 
పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ఎంపీడీవోకు ఫిర్యాదు..
 
                                    - Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

