నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్లో పీఎంశ్రీ నిధులు దుర్వినియోగమైయ్యాయని,దుర్వినియోగం చెసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం సరికాదని డివైఏప్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆత్కూరి శ్రీకాంత్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు పాఠశాల అభివృద్ధికి పీఎంశ్రీ నిధుల కింద రూ.21 లక్షలు మంజూరైతే తూతుమంత్రంగా పనులు చేపట్టి నిదులు ప్రిన్స్ పాల్ కాజేశాడని వెంటనే విచారణ చేపట్టాలని పిర్యాదుతోపాటు పలు పత్రికల్లో ప్రకటనలు చెసిన డిఈఓ విచారణకు అదేశించకపోవడంలో అంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు.నిధుల్లో గోల్ మాల్ జరగలేదని ప్రిన్స్ పాల్ పత్రిక ప్రకన చేయడం సంతోషమే కానీ నిజంగానే ఎటువంటి దుర్వినియోగం జరగకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన వివరాలని ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు.ఇప్పటికైనా మోడల్ స్కూలు ప్రిన్సిపాల్ తక్షణమే పిఎంసి నిధుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో గణేష్, జగన్ పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసిన పట్టించుకోరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



