– డీఓడబ్ల్యు స్వర్ణ లత లెనినా
ఆస్పత్రిలోనే కాన్పులు క్షేమకరం – డాక్టర్ రాందాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
పోషకాహారం తో నే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అని, పోషకవిలువలు పై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించడం అంగన్వాడీ సిబ్బంది కర్తవ్యం అని డీఓడబ్ల్యు స్వర్ణ లత లెనిన్ అన్నారు. పోషణ మాసం కార్యక్రమం లో భాగం గా బుధవారం అశ్వారావుపేట లోని రైతు వేదికలో ప్రాజెక్ట్ స్థాయిలో సీడీపీఓ ముత్తమ్మ అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఓడబ్ల్యు స్వర్ణ లత లెనిన్ మాట్లాడారు. లబ్ధిదారులకు మంచి పోషణ అందించాలి అని,వారికి, వారి కుటుంబ సభ్యులకి పోషకాహారం పై ఈ పోషణ మాసం లో పూర్తి అవగాహన కలిగించడం ఆనందంగా ఉందని అన్నారు.ప్ రతి రోజు వారి ఆహారం లో పోషకాలు ఉండేలా ప్రతి టీచర్ శ్రద్ధ తీసుకోవాలి అని తెలిపారు.
వినాయక పురం పీహెచ్సీ ఎంఓ డాక్టర్ రామదాసు మాట్లాడుతూ .. ఆస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, పోషకాహారం లోపం ఉన్న పిల్లలని ఎన్ఆర్సీ కి పంపే విధం గా శ్రద్ధ తీసుకోవాలి అని తెలిపారు. ఈ కార్య కార్యక్రమంలో ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు,సీడీపీఓ ముత్తమ్మ,ఏసీడీపీఓ అలేఖ్య,ఎంపీడీఓ అప్పారావు,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,వినాయక పురం పీహెచ్ సీ ఎంఓ డాక్టర్ రామదాసు,సూపర్వైజర్ లు వరలక్ష్మి,సౌజన్య,పద్మావతి,రమాదేవి మండలంలో గల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.