నవతెలంగాణ – కుభీర్
గ్రామంలో ఉన్న ప్రతి యువకులు చదువులతో పాటు క్రీడాల్లో నైపుణ్యత సాధించేందుకు తోడ్పాడుతాయని స్థానిక సర్పంచ్ జాదవ్ రంగారావు అన్నారు. శనివారం మండలంలోని రంజిని గ్రామంలో మహాలక్షి జాతర సందర్బంగా కుస్తీ పోటీలు నిర్వహించడం. ఈ పోటీలుగ్రామ విడిసి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోటీలో పాల్గొనేందుకు మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచే అధిక సంఖ్యలో మల్లాయోధులు హాజరయ్యారు. పోటీలను తిలకించేందుకు చుట్టూ ప్రక్కల ప్రజలు హాజరై కేరింతాలు కొడుతూ మల్లాయోధులకు ఉత్సవ పరిచారు. ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 5501రెండో బహుమతి 3501నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కవిత బాయి బన్సీలాల్ రంగారావు మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



