నవతెలంగాణ – మిర్యాలగూడ
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, నేటి ఆధునిక కాలంలో వస్తున్న వివిధ రకాల అనారోగ్యాలకు యోగ సాధనే అత్యుత్తమ ఏకైక మార్గమని తెలంగాణా యోగ టీచర్స్ కో ఆర్ఢినేషన్ కమిటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.సత్యారెడ్డి అన్నారు. శుక్రవారం వేకువ జామున తెలంగాణా యోగ టీచర్స్ కో ఆర్ఢినేషన్ కమిటి రాష్ట్ర కార్యవర్గం బృందం వివిధ యోగ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా సత్యారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం యోగ సాధన చేస్తున్న సాధకులను, వివిధ యోగ కేంద్రాల యోగ భోధకులను అభినందించారు. తెలంగాణా యోగ టీచర్స్ కో ఆర్ఢినేషన్ కమిటి రాష్ట్ర కార్యవర్గం ఉపాధ్యక్షులు డా.కరణం లుగేంద్ర పిళ్ళై మాట్లాడుతూ .. యోగ నిరంతరం సాధన,వ్యాప్తి చేయడం తమ కర్తవ్యంగా భావిస్తే అది సమాజ సేవగా మారుతుందన్నారు.
ఆధునిక వైద్యంలో వివిధ రకాల మందులు వాడటం వల్ల శరీరంలోని కిడ్నీ, లివర్ లాంటి వివిధ అవయవములు దెబ్బతింటున్నాయని, సంపూర్ణ ఆరోగ్యానికి యోగ సాధనే శిరోధ్యారం అని అన్నారు. తెలంగాణ యోగ టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ కోలా సైదులు ముదిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆచార్య శివ, చల్మా రాజు, దోమలపల్లి నాగయ్య, శ్రీనివాస్ సరిత, పైడిమర్రి నరసింహారావు, జైని మురళి, సీతంశెట్టి శ్రీనివాసరావు, ప్రభాకర్ లిశెట్టి లక్ష్మయ్య కొందుటి రాచయ్య, గోవింద్ రెడ్డి, చీదళ వెంకటేశ్వర్లు, కంచర్ల వెంకటేశ్వర్లు, కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, పైడిమర్రి సురేష్, పోలిశెట్టి నాగేశ్వరావు పోలా యాదయ్య పాల్గొన్నారు.
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



