- Advertisement -
– నర్సంపల్లి సర్పంచ్ శైలజ శ్రీశైలం..
నవతెలంగాణ – ఊరుకొండ
మూగజీవాలకు నటల నివారణ మందులు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నర్సంపల్లి సర్పంచ్ శైలజ శ్రీశైలం అన్నారు. బుధవారం ఊరుకొండ మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో నట్టల నివారణ మందు పంపిణీలో భాగంగా గ్రామంలోని మూగజీవాలైన మేకలు, గొర్రెలు, పశువుల దూడలకు నట్టల నివారణ మందు పశు వద్య సిబ్బంది ఆధ్వర్యంలో సర్పంచ్ శైలజశ్రీశైలం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, మేకల గొర్రెల కాపరులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



