Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం 

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం 

- Advertisement -

ఎంఈఓ అంబటి అంజయ్య
నవతెలంగాణ – కట్టంగూర్‌
పౌష్టికాహారమే సంపూర్ణ ఆరోగ్యానికి మూలమని, సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం, సుభిక్ష జీవితం సాధ్యమని మండల విద్యాధికారి అంబటి అంజయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, అశ్రిత స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘పోషణ అవగాహన – ఆరోగ్య పరీక్షలు – బాల్యవివాహాల నిర్మూలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఐసిడీఎస్‌ ఆధ్వర్యంలో పౌష్టికాహార పదార్థాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహార పదార్థాల ప్రాముఖ్యతను వివరించారు.రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ వైద్యులు విద్యార్థినీ, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్వైజర్లు శారద రాణి, పద్మావతి, అశ్రిత సంస్థ ప్రతినిధి ఝాన్సీ, డాక్టర్‌ కే. ప్రియాంక, డాక్టర్‌ ఎం. రామ్‌రెడ్డి, ఫార్మసిస్ట్‌ కే. విజయ్‌కుమార్‌, ఏఎన్ఎం ఉదయ, అంగన్‌వాడీ టీచర్లు జి. పద్మ, భిక్షమమ్మ, ఎన్‌. చంద్రకళ, ఎం. మంగమ్మ, ఆర్‌. లలిత కుమారి, కే. సైదమ్మ, సిహెచ్‌. శోభరాణి, బి. సంధ్య, సిహెచ్‌. వాణి, హసీనా ఉన్నారు. అనంతరం బాల్యవివాహాల నిరోధం, పౌష్టికాహారంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -