Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం 

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం 

- Advertisement -

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని ప్రమీల 
నవతెలంగాణ – బాన్సువాడ, నసురుల్లాబాద్ 

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని రక్తహీనతను అధిగమించేందుకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, జిల్లా ఐసిడిఎస్, మహిళ సంక్షేమ అధికారిని సూచించారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో అంగన్వాడి సెంటర్ ఇందిరమ్మ ఇండ్లను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని, బాన్సువాడ ప్రత్యేక అధికారిని ప్రమీల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో అంగన్వాడి సెంటర్ లో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం చేశారు. అలాగే వసంత పంచమి సందర్భంగా చంటి పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

అలాగే గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో ఉన్న పల్లె ప్రకృతి వనమును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మండల ప్రత్యేక అధికారిని ప్రమీల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరు చదివినియోగం చేసుకోవాలన్నారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చంటి పిల్లలు కు పోస్టుకాహారం అందించాలన్నారు.

ఇంటింటికి వెళ్లి చంటి పిల్లల బాలింతల సర్వే నిర్వహించాలన్నారు. రక్తహీనత బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని ఆమె సూచించారు. ప్రతి అంగన్వాడి కేంద్రాల్లో విద్యార్థుల హాజరు ఎప్పటికప్పుడు అన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ సౌభాగ్యలత , సూపర్ వైజర్ కస్తూరి అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -