కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు జరగబోయే రెండో సాధారణ ఎన్నికల ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలని పలు జిల్లాల కలెక్టర్లను రాష్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వారీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపునకు సంబంధించి రవాణా తదితర అంశాలపై వారికి పలు సూచనలు చేశారు.
టీ పోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్లను మ్యాపింగ్ చేయడంపై దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, 23న రంగారెడ్డి, మేడ్చల్, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



