Saturday, July 26, 2025
E-PAPER
Homeసినిమా'విశ్వంభర' షూటింగ్‌ పూర్తి

‘విశ్వంభర’ షూటింగ్‌ పూర్తి

- Advertisement -

చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్‌పై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు.
చిరంజీవి, మౌని రాయ్‌ పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్‌ నంబర్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది.
ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగతం అందిస్తుండగా, మాస్‌-అప్పీల్‌ ట్రాక్‌లతో అలరించే భీమ్స్‌ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్‌ నెంబర్‌ను కంపోజ్‌ చేశారు. శ్యామ్‌ కాసర్ల రాసిన ఈ పాట అభిమానులకు ఒక ట్రీట్‌గా ఉండబోతోంది.
‘పుష్ప, పుష్ప 2′ చిత్రాలలో బ్లాక్‌ బస్టర్‌ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్‌ ఆచార్య ఈ పాటకు కోరియోగ్రఫీ సమకూర్చారు. 100 మంది డ్యాన్సర్స్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించారు. డ్యాన్స్‌ ఫ్లోర్‌లో చిరంజీవి తన సిగేచర్‌ గ్రేస్‌తో అదర గొట్టారు. మంచి డ్యాన్సర్‌ అయిన మౌని రారు తనదైన స్పార్క్‌ని యాడ్‌ చేశారు. గ్రాండ్‌ స్కేల్‌లో ఉన్న ఈ పాట విజువల్‌ వండర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో త్రిష కష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్‌, కునాల్‌ కపూర్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
‘భిన్న కాన్సెప్ట్‌తో పవర్‌ఫుల్‌ సోషియో ఫాంటసీ సినిమాగా దర్శకుడు వశిష్ట అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో మెగాస్టార్‌ పాత్ర ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్‌ చేస్తుంది’ అని మేకర్స్‌ తెలిపారు. కునాల్‌ కపూర్‌, స్పెషల్‌ సాంగ్‌లో మౌని రారు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌, సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్‌ సిసిరోలియో, డీవోపీ: చోటా కె నాయుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -