నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని ఎడంపల్లిలో ప్రభుత్వ ఎంపీ యుపియూపీఎస్ పాఠశాలను ఖండేబల్లూర్ కాంప్లెక్స్ హెచ్ఎం వై. జనార్ధన్, సిఆర్పి భీమన్న సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్యను పెంచాలని హెచ్ఎం లాలయ్య, ఉపాధ్యాయ బృందానికి సూచించారు. అదేవిధంగా పాఠశాల శుభ్రత పాటించాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని ఆదేశించారు. పాఠశాలకు హాజరుకానీ పిల్లలను గుర్తించి ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు అవగాహన పరచాలని తప్పకుండా ప్రతి ఒక్కరి పిల్లలు బడులకు వచ్చే విధంగా మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నేను ప్రకారం వడ్డించాలని తెలిపారు. ఈ సందర్శన కార్యక్రమంలో కాంప్లెక్స్ సెక్షన్ ఎన్నమ్ వార్ జనార్ధన్ , సిఆర్పి భీమన్న , పడంపల్లి ఎంపియుపిఎస్ పాఠశాల హెచ్ఎం లాలయ్య , ఉపాధ్యాయులు సంగ్రామ్, శ్రీనివాస్ , ఉమాకాంత్, ఖాసిం , తదితరులు పాల్గొన్నారు.
పడంపల్లి ఎంపియుపిఎస్ పాఠశాలను సందర్శించిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES