మొరిగాడి భాగ్య లక్ష్మి అజయ్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మున్సిపాలిటీలో సీపీఐ(ఎం) పార్టీ నుండి నాలుగో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాటమయ్య నగర్,చింతల్ బస్తి,సుభాష్ నగర్,శివాలయం వీధి లలో ఓటర్లతో వారు మాట్లాడుతూ.. నాలుగో వార్డ్ ప్రజలకు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలలో ఉన్నట్లు నాలుగో వార్డు సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని ఆమె అన్నారు. పట్టణంలో సీపీఐ (ఎం) పార్టీ పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లు రేషన్ కార్డుల కోసం నిరంతరం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని ఎంతోమంది పేదలకు అండగా నిలిచిందని ఆమె అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే ఈ వార్డులో ప్రధాన సమస్యలు మురుగు కాలువలు నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం తో పాటుగా ఈ ప్రాంతంలో అనేకమంది పేదలు అద్దె ఇండ్లలో ఉంటున్నారని, వారి సొంత ఇంటి కల నెరవేరే విధంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
మున్సిపాలిటీలో నాలుగో వార్డును ఆదర్శ వార్డుగా నిలిపే విధంగా పరిశుభ్రత చెట్లు నాటే కార్యక్రమాలు నిర్వహించి మీ రుణం తీర్చుకుంటానని ఆమె ఈ వార్డులో ఓటర్లకు హామీ ఇచ్చారు. భాగ్యలక్ష్మి ప్రచారంలో ప్రజలు అనేకమంది ఆమెకు అక్కడ ఉన్న సమస్యలను తెలియజేసి గత పాలకల నిర్లక్ష్యాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో మీ మధ్య ఉండి మీ సమస్యను నా సమస్యగా పరిష్కరిస్తామని అందరం కలిసి మున్సిపల్ పాలకవర్గంలో సీపీఐ (ఎం) ప్రాతినిధ్యం ఉండే విధంగా ఓటు వేసి గెలిపిస్తామని ఈ సందర్భంగా పలువురు ఓటర్లు ఆమెకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, మొరిగాడి రమేష్, జూకంటి పౌలు, వడ్డేమాన్ బాలరాజు, గణగాని మల్లేష్, చేన్న రాజేష్, మొరిగాడి అజయ్, మొరిగాడి రాజు, మొరిగాడి అనిత, కూరగాయల శ్వేత, చింతకాయల శ్రీమాన్, బాబు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.



