Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeజాతీయందేశవ్యాప్తంగా 'ఓటరు జాబితా సమగ్ర సవరణ'

దేశవ్యాప్తంగా ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ’

- Advertisement -

వచ్చే నెల నుంచే ప్రారంభం
ఈనెలాఖరులో ఈసీ తుది నిర్ణయం
న్యూఢిల్లీ :
వచ్చే నెల (ఆగస్టు) నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌ )ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సమాయత్తమ వుతోంది. ఇందుకోసం ఎక్కడికక్కడ ఎన్నికల యంత్రాంగాలను క్రియాశీలం చేస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఓటరు జాబితా సమగ్ర సవరణను మొదలుపెట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. వివిధ రాష్ట్రాల చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారులు (సీఈఓలు) ఆయా రాష్ట్రాల్లో చివరిసారిగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) జరిగిన తర్వాత ప్రచురితమైన ఓటరు జాబితాలను బయటికి తీస్తున్నారు. వాటిని తమ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 2008లో, ఉత్తరాఖండ్‌లో 2006లో చివరిసారిగా ఓటరు జాబితాల సవరణకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. ఆయా సంవత్సరాల్లో ప్రచురించిన ఓటరు జాబితాలను ఢిల్లీ సీఈఓ, ఉత్తరాఖండ్‌ సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లలో ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో చివరిసారిగా 2003లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరిగింది. ఆ ఏడాది ప్రచురితమైన ఓటరు జాబితాలోని సమాచారం ఆధారంగానే ఇప్పుడు బీహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ జరగబోతోంది.


28 తర్వాతే తుది నిర్ణయం
ఓటరు జాబితా సమగ్ర సవరణను ఈసీ చేపట్టడం అనేది రాజ్యాంగబద్ధమైన అంశమేనని, బీహార్‌లో ఆ ప్రక్రియను నిర్వహించొచ్చని గతవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్‌ను చేపట్టే అంశంపై జులై 28 తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తుది నిర్ణయాన్ని తీసుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే అకస్మాత్తుగా బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ డ్రైవ్‌ను నిర్వహించడం వల్ల ఎంతోమంది ఓటుహక్కును కోల్పోతారంటూ దాఖలైన పిటిషన్లపై ఆ తేదీన మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. జన్మస్థల ం ఆధారంగా విదేశాలకు చెందిన అక్రమ వలసదారుల పేర్లను దేశంలోని ఓటరు జాబితాల నుంచి తొలగిస్తామని కేంద్రం ఎన్నికల సంఘం అంటోంది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో, వచ్చే సంవత్సరం అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad