Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ అచ్యుతానందన్ మృతి తీరని లోటు

కామ్రేడ్ అచ్యుతానందన్ మృతి తీరని లోటు

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి
 తుర్కపల్లి మండల కేంద్రంలోని సిపిఐఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం కామ్రేడ్ అచ్యుతానందన్ మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ వి ఎస్ అచ్యుతానందన్ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యుత్తమ నాయకుడు కేరళ తో పాటు వివిధ ప్రాంతాలలో జరిగిన వివిధ పోరాటాలకు నాయకత్వం వహించిన సమర్ధుడైన నాయకుడని తాను పని ప్రారంభించిన అశ్విన్వాల్ కంపెనీలో కొబ్బరి కార్మికులను సంఘటితం చేయడం ద్వారా ఆయన తొలిసారిగా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పోరాటాలు నడిపి కార్మికులకు అండగా నిలబడ్డారని అన్నారు భూస్వాములచే దారుణమైన దోపిడికి గురవుతున్న కొట్టనాడులోని వ్యవసాయ కార్మికులతో కలిసి పని వారి హక్కుల కొరకు నిలబడ్డారని అన్నారు.

కేరళ అసెంబ్లీకి 7 పర్యాయాలు ఎన్నికయ్యారని రెండు పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారని 2006 నుండి 2011 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారని ముఖ్యమంత్రి ఆయన పదవీకాలం అంతా శ్రామికులు పేదల సంక్షేమం కోసమే పని చేశారని ఆయన జీవితకాలం అంతా కార్మికులు వ్యవసాయ కూలీలు కొరకు సామాజిక సమస్యల పరిష్కారం కోసమే అనేక ఉద్యమాల కు నాయకత్వం వహించిన గొప్ప నాయకుడని వారి మరణం ప్రజా ఉద్యమాలకు సిపిఎం పార్టీకి తీరని లోటు అని వారి మృతికి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొక్కొండ లింగయ్య సిఐటియు మండల కన్వీనర్ తూటి వెంకటేశం సిపిఎం నాయకులు బరిగే రాములు సిఐటియు నాయకులు సో మల్ల గణేష్ జ్వాల నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -