నవతెలంగాణ – కామారెడ్డి
కార్మిక, కర్షక, పీడిత ప్రజల హక్కుల యోధుడు కామ్రేడ్ నర్సింహా రెడ్డి సంస్మరణ సభను కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాత జి ఎస్ ఆర్ కళాశాల ఆవరణంలో ఆదివారం నిర్వహించారు. సంస్మరణ సభకు జిల్లాలోని ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై అతనితో వరికున్న అనుబంధం, ప్రజల, కార్మికుల పట్లవున్న అతని అంకితభావాన్ని మననం చేసుకొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంస్మరణ సభకు సిపిఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పశ్య పద్మ అదితిగా హాజరైనారు. వారు మాట్లాడుతూ వి యల్. నర్సింహా రెడ్డి కామారెడ్డి లో మున్సిపల్, ఆర్టీసీ, హమాలీ, హాస్పిటల్ తదితర కార్మిక పోరాటాలు నడిపి ఎన్నో హక్కులు సాధించడానికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు. నక్సలైట్ ఉద్యమకాలంలో అనేక మందికి బెయిల్ ఇప్పించి పేదల వకీల్ గా పేరు ప్రక్యాతులు పొందిన వ్యకి అన్నారు.ఈ సభకు న్యాయవాదులు వేణుగోపాల్, సిద్దిరాములు, వెంకట్రాంరెడ్డి, నవీన్ మున్సిపల్ సంఘ నాయకులు లక్సమణ్, నర్సింగరావు, సిపిఐ జిల్లా నాయకులు దశరథ్, బాలరాజ్, బిఎల్ఎఫ్ నాయకులు సిద్దిరాములు, లెక్చరర్ శంకర్, ఆర్టీసీ నాయకులు వెంకటి గౌడ్, కదిర్, వి. డి దాస్ తదితరులు హాజరయ్యారు.
కార్మిక, కర్షక, పీడిత ప్రజల హక్కుల యోధుడు కామ్రేడ్ నర్సింహా రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



