Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజల మనిషి కామ్రేడ్ వేముల మహేందర్

ప్రజల మనిషి కామ్రేడ్ వేముల మహేందర్

- Advertisement -

ఎండి జహంగీర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో నిరంతరం ప్రజల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం పోరాటం చేసిన నాయకుడు అని ప్రజల మనిషిగా ఎప్పుడూ ప్రజల్లో ఉండే నాయకుడు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. శనివారం స్థానిక సుందరయ్య భవనంలో మహేందర్ 4వ వర్ధంతి సందర్భంగా పూల మాల వేసి నివాళులు అర్పించి అనంతరం వారు మాట్లాడుతూ..  యాదాద్రి భువనగిరి జిల్లాలో కూలీ, రైతు, మహిళా, విద్యార్థి, యువజన పోరాటాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు మహేందర్ అన్నారు. వ్యవసాయ కార్మికుల కోసం కూలీ పెంచాలని, జిల్లాలో అనేక భూపోరాటలు చేసిన నాయకుడు అని వారు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రజా ప్రయోజనకర పనులు వదిలిపెట్టి బడా కార్పొరేట్ సంస్థలను కాపాడే పనిలో పడ్డాయన్నారు.  ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నారు అని వారు అన్నారు. వీరితోపాటు పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొలగాని జయరాములు, గడ్డం వెంకటేష్, నాయకులు ఎదునూరి మల్లేష్, ఈర్లపల్లి ముత్యాలు, వల్లబుదాసు రాంబాబు  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad