Sunday, April 12, 2026
E-PAPER
Homeజాతీయంకామ్రేడ్స్‌ మీరు నా హృదయంలో ఉంటారు : విజయ్

కామ్రేడ్స్‌ మీరు నా హృదయంలో ఉంటారు : విజయ్

- Advertisement -

చెన్నై : త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కామ్రేడ్స్‌ మీరు నా హృదయంలో ఉంటారు అని తమిళగ వెట్రి కజగం (టీవీకే) గెలుపుకు తీవ్రంగా కృషి చేస్తున్న పార్టీ కార్యకర్తలనుద్దేశించి విజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శనివారం పోస్టు చేశారు. ‘నా హృదయంలో నిలిచే కామ్రేడ్స్‌ అందరికీ శుభాకాంక్షలు. చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రయాణంలో మీ వ్యక్తిగత సహకారాలు అమూల్యమైనవి. మార్పుకు ప్రధాన శక్తి అయిన మనం, మన విజయ మార్గంలో సరిగ్గా పయనిస్తున్నాము. ఈ తరుణంలో ఎన్నికలరోజు వేగంగా సమీపిస్తున్న వేళ నేను మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. కామ్రేడ్లుగా మాతో కలిసి ప్రయాణించడానికి తమిళనాడు విక్టరీ లీగ్‌లో చేరిన పోలింగ్‌ బూత్‌ కన్వీనర్లు, సభ్యులు, నా ప్రియమైన స్నేహితులు, లీగ్‌పై అపారమైన ప్రేమ ఉన్న స్నేహితులరా మీరందరూ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి పని చేపట్టండి.

విజిల్‌ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ముఖాముఖిగా కలిసి విజ్ఞప్తి చేయాలి’ అని విజయ్ బూత్‌స్థాయి కన్వీనర్లును కోరారు. రాబోయే పది రోజులు మీకు అనుకూలమైన సమయాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో మీరు నివశించే ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి, మన సొంత ప్రజలైన తమిళనాడు ప్రజలను ప్రతిరోజూ కలిసి లీగ్‌ అభ్యర్థులకు మద్దతుగా విజిల్‌ గుర్తుకు ఓటు వేయమని విజ్ఞప్తి చేయండి. ఈ క్షేత్రస్థాయి పనిలో స్వచ్ఛంద సేవకులుగా పాల్గొనవలసిందిగా ఆ పార్టీ కార్యకర్తలను ఆయన అభ్యర్థించారు. ఈ ఎన్నిక కేవలం మన కోసం మాత్రమే కాదని, ఇది ఒక గొప్ప మార్పు కోసం, ఒక తరం కోసం జరిగే ఎన్నిక అని వివరించాలని విజయ్ కోరారు. ఈ ఎన్నికల్లో మీ నిస్వార్థ కృషిని అంకితం చేసి, మన విజయయాత్రకు బలాన్ని చేకూర్చండి అని విజయ్ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -