ఏకాగ్రత కల్గివుండటం అసాధ్యమేమీ కాదు. అది ఒక అలవాటుగా సంతరింపచేసుకునే లక్షణం శ్రద్ధ, ఆసక్తి దానికి ఇంధనం. ప్రయోజనాన్ని గుర్తెరిగి… ఆ లక్ష్యదిశగా మీ మైండ్‌ను రీప్రోగ్రామింగ్ చేసుకుంటే దష్టికి కావల్సిన విషయంపై కేంద్రీకరించి వుంచడం శ్వాసక్రియలా మీ సహజ లక్షణంలా మారిపోతుంది.
కెరీర్ అంటే అర్ధం ఏమిటి..? చాలామంది తాము చేస్తున్న వత్తి, వ్యాపారాది కార్యక్రమాలను మాత్రమే ‘కెరీర్’ అని నిర్వచించాలనుకుంటారు. వాస్తవానికి కెరీర్ అన్న పదం ‘కెరీర్’ అనే ఫ్రెంచి భాషలోంచి పుట్టింది. దానర్థం రేస్ కోర్స్ అని. గుర్రాల రేసు కాదండోరు..! రేస్ కోర్సు అంటే ఇక్కడ ‘గమనపథం’ అని అర్ధం. ఇది ముందుకు పోవడాన్ని సూచిస్తుంది. విద్యార్థి దశలో వ్యక్తికూడా అభ్యసన కార్యక్రమాల లోను, ఉపాధికల్పనా శిక్షణలోనూ ముందుకుపోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్జన కాలాన్ని కూడా కెరీర్ గానే అభివర్ణించడం జరుగుతుంది. దీనిని ఎడ్యుకేషనల్ కెరీర్, ఎకడమిక్ కెరీర్ అనే పదాలతో కూడా వ్యవహరించడం జరుగుతుంది. కెరీర్‌లో వున్న వ్యక్తులు అది వ్యాపారం అయినా, వత్తి అయినా, చదువయినా అభివద్ధి సాధనే ప్రధమ లక్ష్యంగా ఎంచుకుని తాము నిర్ధారించుకున్న పథంలోకి ముందడుగు వేస్తారు. అందుకు ఏకాగ్రత ఒక అత్యవసరమైన ప్రాధమిక లక్షణం. విద్యార్ధి దశలో కెరీర్, ఉపాధి కల్పనా రంగానికి చెందిన బహుళ ప్రయోజనాలను అందించే శిక్షణాంశాలను తర్ఫీదు పొందడంపై ఆధారపడి వుంటుంది. కాబట్టి ఈ దశలో విద్యార్థులకు ఏకాగ్రత ఆవశ్యకత మరింత ఎక్కువగా వుంటుంది.
ఈ విద్యార్ధి దశలో ప్రతి విద్యార్థికి తన భవిష్యత్తు పట్ల స్పష్టమైన లక్ష్య నిర్దేశనం వుండాలి. గోల్ స్పష్టంగా లేకపోతే ఏకాగ్రత సాధ్యంకాదు. వారెంచుకున్న భవిత స్వరూపం వారికి ఎప్పుడూ కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుండాలి.
మీరు డాక్టర్ కావాలనుకుంటే, మీరు ఒక డాక్టర్ అయిపోయినట్లుగా వూహించు కోండి. డాక్టర్ కోటు వేసుకొని, మెళ్ళో స్టెతస్కోపుతో ఒక ఫొటో దిగండి. ఆ ఫొటోని స్టడీ రూమ్‌లో మీకు కన్పించే చోట తగిలించి వుంచండి.
మీ లక్ష్యం ఎప్పుడూ కంటి ముందు కన్పించే వస్తువులా వుండాలి. అంతేకానీ మీరు తీర్చవల్సివున్న అప్పులా మిమ్మల్ని భయపెట్టకూడదు.
మీ లక్ష్యం ఏమిటో బోధపడటంలో స్పష్టత వుండాలి. అయితే ఆ లక్ష్యసాధన ఫలితాలను దీర్ఘకాలిక ప్రయోజనాలను, లాభనష్టాలను బేరీజువేసుకోవడంతోనే మీరు కాలాన్ని గడిపెయ్యకూడదు. అలా చేయడం వల్ల సదరు ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వర్తమాన స్థితిలో మీరు చేయవలసివున్న లేదా ముగించవలసి వున్న కార్యక్రమం దెబ్బతింటుంది. మీ ఏకాగ్రత విచలితం కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి.
నేను పర్ఫెక్టుగా వుండాలి అని పరిపూర్ణవాదంతో తపన పడకండి. మీరు పూర్తి చేయవల్సి వున్న కార్యాలను సఫలీకతంగా పూర్తి చేయడానికి మీవంతు ఉత్తమ స్థాయి ప్రయత్నం మీరు చేయ గలరని విశ్వసించండి.
మీ ఏకాగ్రతకు భగం కల్గించే అంశాన్ని తీసుకోండి. మీ ఏకాగ్రత కన్నా అది ఏ అంశాల మేరకు ప్రముఖమైనదో విశ్లేషించండి. తరచు మీ ఏకాగ్రతను చెదర గొడ్తున్న ఈ అంశాన్ని తొలగించటానికి ప్రయత్నించండి.
అది స్వల్పకాలిక వ్యవధితో పూర్తి కాగల చర్య అయితే, మీ చదువును పక్కనపెట్టి, ఆ పనిని పూర్తి చేయడం చాలా మేలైనపని. ఆ చర్యను చేయకుండా వాయిదా వేస్తూ మీ ఏకాగ్రతను దెబ్బ తీసుకోవడం కన్నా, ఒకేసారి మీ ఏకాగ్రతను చెదరగొట్టే చర్యను పూర్తిచేసెయ్యటం మంచిది.
మీ ఇంట్లో డిస్టర్బెన్స్ లేని ప్రదేశాన్ని మీ చదువుకు ఎంచుకోండి. అక్కడ టి.వి., ఫ్రిజ్ వంటి వస్తువులు వుండరాదు.
మీరు చదువుకునే చోటు, చదవాలన్పించే చోటులా వుండాలి. అంతేకాని చదువుతప్ప మిగిలిన అన్ని పనులు చేసుకునేదిగా వుండకూడదు. ఉదాహరణకు మీరు బెడ్రూంని స్టడీరూంగా పెట్టుకోరాదు. పరుపు మీద పడుకుని చదువుదాం అనుకోవడం మంచి ఆలోచన కాదు.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఏదో ఒక నిర్ణీత సమయంలోనే చదువుకోవాలన్న నియమం పెట్టుకోండి. ఆ టైమ్‌ని అందరికీ ఎనౌన్స్ చేయండి. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరూ కలవకుండా, మీ ఏకాగ్రతను చెదరగొట్టకుండా జాగ్రత్త పడండి.
చదువుకు సంబంధించిన అన్ని పుస్తకాలను, నోట్సులను, ఫైళ్ళను అందు బాటులో వుంచుకోండి.
చదువుకోవడం పూర్తయిన తరువాత, పుస్తకాలను పెన్నులను తెరిచి, చిందర వందరగా పడెయ్యకండి. అన్నిటినీ యధా ప్రదేశాలలో భద్రపరచండి. మీరు చదువుకోవటానికి రూంలోకి ప్రవేశించిన తరువాత చాలా కోర్సు పెండింగ్‌లో వుందన్న ఫీలింగ్ మీకు రాకూడదు. పైగా చిందరవందరగా వున్న వాటిని సర్దుకోవడంతోనే గడిచిపోతుంది.
టేబుల్ ముందు కూర్చున్న తరువాత, నిమిషం పాటు శ్వాసక్రియ వ్యాయామం చెయ్యండి. రెండు నిమిషాల పాటు మీ శరీరాన్ని మనసుని పూర్తిగా రిలాక్స్ కానివ్వండి.
చదువుకోవటానికి మీరు పెట్టుకున్న నియమిత కాలవ్యవధి సమీపించేలోపునే మీ పనులన్నిటినీ పూర్తిచేసుకోండి. ఒక ఊరు వెళ్ళటానికి గంటముందే మన పనులన్నిటినీ పూర్తి చేసుకున్నట్లుగా, ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఏదో ఒక తప్పనిసరి పనిలో వుంటే మాత్రం, చదువుకునే టైం అయ్యింది. కదా అని హడావిడిగా ఇంటికి చేరకండి. అలా చేసిన రోజున మీరు ఏదీ చదవలేరు.’
మీరు ఏ రోజు పూర్తి చేసిన కోర్సును ఆ మరుసటి రోజు మీ ఫ్రెండ్స్ తో చర్చించండి. ఆ కోర్సుకు సంబంధించి పరీక్షల్లో రాగల కామన్ ప్రశ్నలపై మీకు అవగాహన పెరుగుతుంది.
ఎప్పటికప్పుడు పాజిటివ్ అఫర్మేషన్లతో మిమ్మల్ని మీరు ఉత్తేజపర్చుకోండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్



