Sunday, February 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో బీఆర్ఎస్ రాస్తారోకో, ఆందోళన

మద్నూర్ లో బీఆర్ఎస్ రాస్తారోకో, ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్ 
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేదింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి పాత బస్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ఆందోళన చేపట్టారు.

జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించిన మద్నూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్  జోలికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం జరుగుతుందని వారు హెచ్చరించారు. తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ఊరుకోదని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మద్నూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -